రోడ్డు ప్రమాదంలో సోనూ సూద్ భార్యకు గాయాలు

  • సోనూ సూద్ భార్య, ఆమె సోదరికి రోడ్డు ప్రమాదం
  • ముంబై-నాగ్‌పూర్ హైవేపై ఘటన
  • ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న కారు
  • ప్రమాద సమయంలో కారు నడుపుతున్న సోనూ మేనల్లుడు
ప్రముఖ నటుడు సోనూ సూద్ అర్ధాంగి సోనాలి, ఆమె సోదరి సుమితా సాల్వే రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ముంబై-నాగ్‌పూర్ హైవేపై సోనూ సూద్ భార్య సోనాలి (54), ఆమె సోదరి సుమితా సాల్వే (55) ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న ట్రక్కును ఢీకొనడంతో గాయపడ్డారు. 

సోనాలి, సుమితా నాగ్‌పూర్ విమానాశ్రయం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో సోనాలి మేనల్లుడు కారు నడుపుతున్నట్టు తెలిసింది. 

సోనేగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వార్ధా రోడ్ ఫ్లైఓవర్ మీద ఈ ప్రమాదం జరిగింది. మ్యాక్స్ హాస్పిటల్ వైద్యుడు అభిజీత్ భాట్కుల్కర్ తెలిపిన వివరాల ప్రకారం... సోనాలి, సుమిత ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. స్వల్ప గాయాలైన సోనాలి మేనల్లుడికి ప్రథమ చికిత్స చేసి పంపించేశారు.



Sonali Sonu Sood
Sonu Sood
Road Accident
Mumbai-Nagpur Highway
Car Crash
Sonali's Sister
Sumita Salve
Max Hospital
Minor Injuries
India

More Telugu News